
కిష్కింధపురి రివ్యూ & రేటింగ్: డిఫరెంట్ హారర్ డ్రామా
కథ :
రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) – మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లు జంటగా “ఘోస్ట్ వాకింగ్” టూర్స్ చేస్తుంటారు. హాంటెడ్ హౌసెస్‌లోకి ప్రజలను తీసుకెళ్లి భయాన్ని రుచి చూపించడం వారి పని. ఒక రోజు వారిద్దరూ కిష్కింధపురి పరిసరాల్లో ఉన్న పాత “సువర్ణమాయ రేడియో స్టేషన్”కి వెళ్తారు. 1989లో మూతబడ్డ ఆ స్టేషన్‌లో ఒక దెయ్యం ఉంటుందని చెబుతారు.
ఆ దెయ్యం పగతో రగిలిపోతూ అందరినీ చంపేస్తానని హెచ్చరిస్తుంది. దానికి కారణం ఏమిటి, ఆ ఆత్మ వెనుక అసలు కథ ఏంటి, రాఘవ్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఎందుకు ఎదురెళ్లాడు? ఇవే సినిమా మిగిలిన భాగం.
విశ్లేషణ :
దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఓ కొత్త కాన్సెప్ట్ ఎంచుకోవడం అభినందనీయం. రివెంజ్ డ్రామాలో హారర్ అండ్ ఎమోషన్ మిళితమై ఉండడం సినిమాకి బలం. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న ఎమోషనల్ టచ్ బాగా వర్కౌట్ అయింది.
హీరోగా బెల్లంకొండ తన యాక్షన్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. హీరోయిన్ అనుపమ తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి సీనియర్ నటులు తమ పాత్రల్లో బాగా చేశారు.
మొత్తం మీద “కిష్కింధపురి” టెంప్లేట్ హారర్ మూవీలా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం కనిపించడం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. అయితే, కొన్ని సీన్స్ స్లోగా సాగడం వల్ల గ్రిప్ కొంత తగ్గింది.
ప్లస్ పాయింట్స్ :
బెల్లంకొండ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్.
అనుపమ పరమేశ్వరన్ నటన.
హారర్ ఎఫెక్ట్స్, విజువల్స్.
క్లైమాక్స్‌లో ట్విస్టులు.
మైనస్ పాయింట్స్ :
కథనం కొన్నిచోట్ల నెమ్మదిగా సాగడం.
కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం.
Rating : 3/5
