Saturday, June 13, 2026
HomeNationalయాపిల్ iOS 26 వచ్చేసింది.. ఐఫోన్‌కి లిక్విడ్ గ్లాస్ మ్యాజిక్ లుక్

యాపిల్ iOS 26 వచ్చేసింది.. ఐఫోన్‌కి లిక్విడ్ గ్లాస్ మ్యాజిక్ లుక్

apple-ios26-update-iphone-glass-look

న్యూస్ డెస్క్: యాపిల్ తన వినియోగదారుల కోసం 2025లోనే అతిపెద్ద అప్‌డేట్‌గా iOS 26ని విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో ఐఫోన్లు కొత్త రూపంలో మెరిసిపోనున్నాయి. ముఖ్యంగా “లిక్విడ్ గ్లాస్ డిజైన్” తో ఫోన్లు గాజులా కనిపించనున్నాయి.

ఈ కొత్త డిజైన్‌లో లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్ పారదర్శకంగా, కదలికలకు అనుగుణంగా డైనమిక్‌గా మారిపోతాయి. యాప్ ఐకాన్లను కూడా గ్లాస్ తరహా స్టైల్‌లో మార్చుకోవచ్చు. ఫోన్ వాడకం మరింత అందంగా మారనుంది.

కమ్యూనికేషన్ కోసం లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను జోడించారు. మెసేజ్‌లు, వీడియో కాల్స్, ఫోన్ కాల్స్‌లోనూ మాటలు ఆటోమేటిక్‌గా అనువదించబడతాయి. ఎయిర్‌పాడ్స్ ద్వారా కూడా ప్రత్యక్ష సంభాషణలకు అనువాదం పొందొచ్చు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ కోసం “కాల్ స్క్రీనింగ్” ఫీచర్ ఉపయోగపడనుంది. కస్టమర్ కేర్‌లో హోల్డ్‌లో పెట్టినప్పుడు “హోల్డ్ అసిస్ట్” ఆటోమేటిక్‌గా లైన్‌ను మానిటర్ చేసి, ఏజెంట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే యూజర్‌కు నోటిఫికేషన్ ఇస్తుంది.

సృజనాత్మక వినియోగదారుల కోసం “జెన్‌మోజీ క్రియేషన్”, “ఇమేజ్ ప్లేగ్రౌండ్” ఫీచర్లు జోడించారు. చాట్‌లకు వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్‌లు సెట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

మొత్తం 26 కొత్త ఫీచర్లతో వచ్చిన iOS 26, ఐఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular