
న్యూస్ డెస్క్: భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. గిల్ తన అద్భుత ఫామ్‌తో ఇప్పటికే 8 ఇన్నింగ్స్‌లలో 722 పరుగులు సాధించి, ఇప్పుడు దిగ్గజ ఆటగాళ్లైన సునీల్ గవాస్కర్, బ్రాడ్‌మన్ రికార్డులను అధిగమించడానికి సన్నద్ధంగా ఉన్నాడు.
గవాస్కర్ కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో 732 పరుగులు చేసిన రికార్డుకు గిల్ కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతేకాదు, ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్ 774 పరుగులు చేసిన రికార్డును అధిగమించడానికి గిల్‌కు ఇంకా 53 పరుగులు కావాలి. మరోవైపు, బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో 810 పరుగులు సాధించిన రికార్డు కూడా గిల్ టార్గెట్.
ఇంకా ఒక విశేషం ఏంటంటే, ఈ సిరీస్‌లో ఇప్పటికే గిల్ నాలుగు సెంచరీలు సాధించాడు. చివరి టెస్టులో మరో సెంచరీ చేయగలిగితే, ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనతలో గవాస్కర్, బ్రాడ్‌మన్‌లతో సమంగా ఉన్నాడు.
భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో వెనుకబడి ఉంది. ఒవల్ టెస్టు గిల్‌కు మాత్రమే కాదు, భారత జట్టుకూ కీలకం. గిల్ రికార్డులు బద్దలు కొడతాడా, టీమ్ ఇండియా సిరీస్‌ను సమం చేస్తుందా అన్న ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నారు.