
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచస్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రకారం, మోదీ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు.
దాదాపు 75 శాతం మంది మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఫలితాలను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ సర్వేలో, మోదీ తరువాత దక్షిణ కొరియా నేత లీ జే-మ్యుంగ్ 59 శాతం మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 57 శాతం, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56 శాతం మద్దతు పొందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
మోదీకి ఈ రేటింగ్ రావడానికి ఆయన బలమైన నాయకత్వమే కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న గౌరవం, అభివృద్ధి పనితీరు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
ప్రపంచ స్థాయిలో భారత్ నాయకత్వాన్ని మెరుగ్గా నిరూపించుకున్న నాయకుడిగా మోదీకి మరోసారి విశ్వసనీయత చాటారు.
