
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచే రెండు భారీ సినిమాలు “కూలీ” మరియు “ఓజి”. రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కూలీ”కి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది.
అలాగే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న “ఓజి” కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొల్పింది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో “కూలీ” గ్రాండ్ ప్రీమియర్స్‌కు సిద్ధమవుతోంది. ఈ ఆగస్ట్ 13న యూఎస్ మార్కెట్‌లో “కూలీ” ప్రింట్‌లతో పాటు, పవన్ కళ్యాణ్ “ఓజి” నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నారని టాక్. దీని వల్ల అక్కడ తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే ఉత్సాహం నెలకొంటుందని పరిశ్రమలో ఊహాగానాలు వస్తున్నాయి.
ఇప్పటికే “కూలీ”కి యూఎస్ లో బుకింగ్స్ మంచి హవా చూపిస్తున్నాయి. మరి “ఓజి” గ్లింప్స్‌తో ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ అందనున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, “ఓజి” ఫస్ట్ సింగిల్ పై కూడా మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఆ పాట కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
