Saturday, August 15, 2026
HomeMovie Newsఓటిటిలోకి సిద్ధార్థ్ లేటెస్ట్ ఎమోషనల్ మూవీ

ఓటిటిలోకి సిద్ధార్థ్ లేటెస్ట్ ఎమోషనల్ మూవీ

3bhk-siddharth-latest-movie-streaming-on-amazon-prime

టాలెంటెడ్ నటుడు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన “3 బి హెచ్ కె” చిత్రం ఇప్పుడు ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు సాయి గణేష్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే థియేటర్‌లో మిస్ అయినవాళ్లకి ఇప్పుడు ఈ సినిమాను హోమ్‌లోనే చూసే అవకాశం వచ్చింది.

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను నేటి నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నటుడు శరత్ కుమార్, దేవయాని, చైత్ర జె ఆచార్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

కుటుంబ విలువలు, తండ్రి-కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు చూపించారు.

ఈ సినిమాలోని ప్రధానమైన ఎమోషన్స్ ప్రేక్షకుల మనసును తాకేలా ఉన్నాయి. అమృత్ రామ్ నాథ్ సంగీతం అందించగా, అరుణ్ విశ్వ నిర్మాణం చేశారు. ఓ మనసుని తాకే ఫ్యామిలీ డ్రామా కోరుకునే వారికి “3 బి హెచ్ కె” మంచి ఎంపిక అవుతుంది.

ఓటీటీలో ఈ చిత్రం చూసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular