
టాలీవుడ్ లో ఎవర్‌గ్రీన్ హీరోగా పేరున్న నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరోయిన్లుగా కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన ఇషా కొప్పికర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇషా కొప్పికర్ చెబుతున్న కథ ప్రకారం, ఈ సినిమాలో నాగార్జున ఆమెను కొట్టే సన్నివేశం ఉంది. అప్పటికి తనకు రెండో సినిమా కావడంతో, ఆ సీన్‌లో అసలైన భావోద్వేగం రాలేదని, అందుకే నాగార్జునను నిజంగా కొట్టమని తానే చేపిందట. మొదట నాగార్జున మెల్లగా కొట్టినా, సీన్ నేచురల్‌గా కనిపించకపోవడంతో డైరెక్టర్ మరిన్ని టేక్స్ తీశారు.
దాంతో, చివరికి ఇషా చెబితే, నిజంగా 15 సార్లు చెంపదెబ్బలు తినాల్సి వచ్చిందట. ఆ టేక్స్ తర్వాత నాగార్జున ఆమెకు సారీ చెప్పారని కూడా వెల్లడించింది. అంతే కాదు, అంతా పూర్తయ్యాక బుగ్గపై మచ్చలు పడిపోయాయని చెప్పారు.
ఈ కామెంట్స్ సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల షూటింగ్ వెనుక జరిగే ఇటువంటి సంఘటనలు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతున్నాయి.
