
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం మహావతార్ నరసింహ అనే యానిమేషన్ చిత్రం చర్చనీయాంశంగా మారింది. డివోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు అశ్విన్ కుమార్ ప్రత్యేకమైన హావభావాలు తీసుకొచ్చాడు. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది.
వీకెండ్ తర్వాత సాధారణంగా సినిమాల కలెక్షన్లు పడిపోతుంటాయి. కానీ మహావతార్ నరసింహ మాత్రం బాక్సాఫీస్ వద్ద అదే ఉత్సాహంతో గర్జిస్తోంది. విడుదల రోజు బుక్ మై షో లో 80 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తాజాగా మంగళవారం వర్కింగ్ డే అయినా కూడా 2 లక్షల 30 వేల టికెట్లు సేల్ కావడం ఇండస్ట్రీలో ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇదే ఆదివారం హాలిడే సమయంలో వచ్చిన బుకింగ్స్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ లెక్కన మహావతార్ నరసింహ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యానిమేషన్ సినిమాకు ఇంత ఆదరణ రావడం అరుదైన విషయంగా చెప్పాలి.
ఈ చిత్రానికి సంగీతం సామ్ సి ఎస్ అందించగా, హోంబళే ఫిల్మ్స్ మరియు క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ప్రస్తుతానికి వీక్ డేస్ లో కూడా సినిమాకు మంచి రన్ రావడం చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తోంది.
