Tuesday, March 10, 2026
HomeMovie Newsబుకింగ్స్ లో కింగ్డమ్ కు సాలిడ్ రెస్పాన్స్

బుకింగ్స్ లో కింగ్డమ్ కు సాలిడ్ రెస్పాన్స్

kingdom-movie-bookings-vijay-deverakonda

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పట్ల మంచి హైప్ వచ్చింది.

తాజాగా బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు కింగ్డమ్ సినిమా లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది విజయ్ దేవరకొండ సినిమాలకు వస్తున్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాకు మంచి ఆకర్షణ ఉంది.

ఇలాంటి అద్భుతమైన బుకింగ్స్‌తో సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. సినీ వర్గాల్లో కూడా కింగ్డమ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లపై ఆసక్తిగా చర్చ జరుగుతోంది. నిర్మాతలు కూడా ప్రమోషన్స్‌కు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. కింగ్డమ్ సినిమా జూలై 31న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular