
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అందరి చూపు ఫస్ట్ సింగిల్ మీదే ఉంది.
ఇటీవల సంగీత దర్శకుడు థమన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. గన్ ఎమోజీతో ‘కల్ట్స్’ అంటూ చిన్న మెసేజ్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. దీనితో ఓజి ఫస్ట్ సింగిల్‌పై స్పెషల్ అలర్ట్ వచ్చిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం ఈ సాంగ్‌ను ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ మ్యూజిక్ లవర్స్‌లో మాత్రం క్యూరియాసిటీ పెరిగిపోయింది. థమన్ నుంచి మరో సూపర్ హిట్ మాస్ సాంగ్ వస్తుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా విడుదల కూడా దగ్గరపడుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
