
న్యూస్ డెస్క్: టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కి ఈ టెస్టు పూర్తిగా పరీక్షగా మారింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ తన నిర్ణయాల్లో తడబడినట్టు కనిపించింది. రెండో రోజు నుంచి తీసుకున్న నిర్ణయాలు, మూడో రోజుకి కొనసాగాయి.
ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్ విషయంలో గిల్ వేగంగా స్పందించలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చే సూచనలతోనో, లేక తన నిర్ణయమో, గిల్ కొన్ని కీలక విషయాల్లో తప్పిదాలు చేశాడనే మాటలు వినిపిస్తున్నాయి. కామెంటేటర్లు, మాజీ ఆటగాళ్లు గిల్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఒక ముఖ్యమైన దశలో, వాషింగ్టన్ సుందర్‌ను ఉపయోగించడంలో గిల్ ఆలస్యం చేశాడు. బంతి టర్న్ అవుతున్న సమయంలో కూడా సుందర్‌ను బౌలింగ్‌కు తీసుకురాలేదు. 68 ఓవర్ల వరకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇంగ్లండ్‌కు పెను భాగస్వామ్యం నిర్మించడానికి అవకాశం దొరికింది.
జో రూట్, ఓలీ పోప్‌లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 332 పరుగులతో నిలిచింది. రెండో సెషన్‌లో గిల్ సుందర్‌కు బంతినిచ్చిన వెంటనే, సుందర్ తన ఐదో ఓవర్‌లోనే ఓలీ పోప్‌ను ఔట్ చేశాడు. అదే సమయంలో, తరువాతి ఓవర్లో హ్యారీ బ్రూక్‌ను కూడా స్టంప్ చేసి పెవిలియన్ పంపాడు.
ఇది గిల్ నిర్ణయాలపై మరింత చర్చను తెరలేపింది. ఫ్యాన్స్ మధ్య గిల్‌ను విమర్శించే వారు, సమర్థించే వారు ఉన్నారు. కొందరు త్వరగా బౌలింగ్‌కు అవకాశమిస్తే ఇంగ్లండ్‌కు అవకాశం దక్కేది కాదని భావిస్తుంటే, మరికొందరు మాత్రం బంతి పాతబడే వరకు వేచి చూడడమే సరైందని అంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై చర్చ కొనసాగుతోంది. టీమిండియాకి మూడో రోజు ఈ నిర్ణయాలు ఎంతవరకు ఫలితాన్నిచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది.
