
మాస్ మహారాజా రవితేజ తన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే విషయంలో డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. కొడుకు మహాధన్ కూతురు మోక్షధలను మామూలు హీరో హీరోయిన్లలా కాకుండా, టెక్నికల్‌గా సిద్ధం చేస్తున్నారు.
మహాధన్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా, ముందు సినిమా మేకింగ్‌ను అర్థం చేసుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ వంగ స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులకు ఏడీగా పనిచేస్తున్నాడు.
ఇక కూతురు మోక్షధ నిర్మాణ రంగంలో తన సత్తా చాటాలని చూస్తోంది. అందుకే రవితేజ బ్యానర్ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటోంది. త్వరలో శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుందట.
తనకు లైఫ్ ఇచ్చిన సినిమాల్లోనే, తన బిడ్డలను భాగస్వాములను చేస్తున్నారు రవితేజ. వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంకరేజ్ చేస్తున్నారు. మహాధన్ సందీప్ వంగ లాంటి వారి దగ్గర పనిచేయడం వల్ల మంచి ఎక్స్ పీరియన్స్ పొందే ఛాన్స్ ఉంది.
రవితేజ ప్లానింగ్ చూస్తుంటే.. మహాధన్ హీరోగా మారతాడా లేక డైరెక్టర్‌గా కొనసాగుతాడా అన్నది కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ భక్తమహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సంక్రాంతి బరిలోకి వస్తున్నారు.
