Friday, December 12, 2025
HomeMovie Newsరవితేజ మాస్ జాతర వాయిదా పడనుందా?

రవితేజ మాస్ జాతర వాయిదా పడనుందా?

Mass-Jathara-release-postponement-trouble

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర ఆగస్ట్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా తప్పదని ఫిలింనగర్ టాక్. టీజర్ కు వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఆశించినంతగా లేకపోవడంతో, ట్రైలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని టీమ్ ఆలోచిస్తోంది.

ఒకవేళ వాయిదా కచ్చితమైతే, కొత్త రిలీజ్ డేట్ విషయంలో సమస్యలు తప్పవు. ఎందుకంటే సెప్టెంబర్ నెల ఇప్పటికే హాట్ రిలీజ్‌లతో నిండిపోయింది. మొదటి వారంలో ఘాటీమిరాయ్మదరాసి, రెండో వారంలో కిష్కిందపురిభద్రకాళి లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాదు, సెప్టెంబర్ 25న అఖండ 2 మరియు ఓజి మధ్య భారీ క్లాష్ జరుగనుంది.

ఈ పరిస్థితుల్లో మాస్ జాతర కోసం సరైన డేట్ కనుగొనడం కష్టతరమవుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా కాంతారఇడ్లి కడాయి వంటి ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త తేదీ కోసం తలనొప్పి పడాల్సి వస్తోంది.

మరోవైపు, సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. కింగ్డమ్ అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోవడం, వార్ 2 కూడా తెలుగులో పెద్ద వసూళ్లు సాధించకపోవడంతో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థిలో మాస్ జాతర రిలీజ్ వాయిదా సంస్థకు మరింత ఒత్తిడిని తెచ్చిపెట్టే అవకాశముంది.

అభిమానులు మాత్రం సినిమా ఎప్పుడు విడుదలైనా, రవితేజ స్టైల్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular