
న్యూస్ డెస్క్: బాక్సాఫీస్ వద్ద ఆంధ్ర కింగ్ తాలూకా అంచనాలకు మించి జోరు చూపిస్తోంది. గురువారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా, షో షోకూ పుంజుకుంటున్నాయి. ఇదొక లాంగ్ రన్ రేస్ గుర్రం అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సినిమాకు వస్తున్న బలమైన పాజిటివ్ టాక్ ఈ రన్‌కు ప్రధాన కారణం. రొటీన్ మాస్ హంగామా కాకుండా, కథలోని ఎమోషన్ నిజాయితీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెల్లగా థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఓవర్సీస్‌లో రామ్ కెరీర్లోనే ఈ సినిమా ‘హైయెస్ట్ గ్రాసర్’గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. మాస్ సినిమాకు క్లాస్ ఆడియన్స్ ఉండే అమెరికాలో ఈ రేంజ్ ఆదరణ దక్కడం నిజంగా విశేషం. అక్కడ వసూళ్లు చాలా నిలకడగా ఉన్నాయి.
లోకల్ మార్కెట్‌లో శని ఆదివారాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. చాలా మేజర్ సెంటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. స్టడీ కలెక్షన్స్‌ను మెయింటైన్ చేస్తూ వీకెండ్ అడ్వాంటేజ్‌ను ఫుల్ గా వాడుకోవడానికి సినిమా రెడీ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డ్రాప్స్ లేకుండా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
