Thursday, February 12, 2026
HomeMovie Newsస్పిరిట్‌లో మరో బ్యూటీ.. ప్రభాస్ సినిమాకు కొత్త క్రేజ్!

స్పిరిట్‌లో మరో బ్యూటీ.. ప్రభాస్ సినిమాకు కొత్త క్రేజ్!

prabhas-spirit-movie-madonna-sebastian-new-entry

ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మరో క్రేజీ హీరోయిన్ కూడా జాయిన్ అవుతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

మలయాళ భామ మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో కనిపించనుందని టాక్ ఉంది. ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మడోన్నా, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో నాని నటించిన శ్యామ్ సింగరాయ్లో లాయర్ పాత్రలో కూడా కనిపించింది.

హీరోయిన్ గానే కాదు, ముఖ్యమైన పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించగలగడం ఆమె ప్రత్యేకత. స్పిరిట్‌లో ఆమె రోల్ ఏంటన్నది ఫ్యాన్స్‌లో పెద్ద కుతూహలంగా మారింది. సందీప్ వంగ కథలో ప్రతి పాత్రకు పర్ఫెక్ట్ సెట్ చేస్తాడనే నమ్మకం ఉంది.

యానిమల్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఉంటారన్న టాక్ మరింత క్రేజ్‌ని పెంచుతోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రభాస్ డేట్స్ ఇచ్చిన వెంటనే షూట్ మొదలవుతుంది. ఆరు నెలల్లోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో స్పిరిట్ కూడా వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular