Saturday, May 2, 2026
HomeMovie News‘ఓజీ’ వీకెండ్ వసూళ్లు.. ఆ మైలురాయి కాస్త దూరంలో!

‘ఓజీ’ వీకెండ్ వసూళ్లు.. ఆ మైలురాయి కాస్త దూరంలో!

pawan-og-overseas-boxoffice-collection-update

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ హైప్‌తో ముందుకెళ్తోంది.

ఓవర్సీస్ ప్రీమియర్స్‌ లోనే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. దీంతో వీకెండ్‌కల్లా 5 మిలియన్ దాటుతుందని అంచనాలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం, సినిమా ఆదివారం వరకు 4.9 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోయింది. అంటే 5 మిలియన్ మైలురాయి కాస్త మిస్ అయినట్టే. అయితే ఇది పవన్ కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లు కావడం విశేషం.

డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఊరట లభించింది. 25.5 కోట్లకు అమ్ముడైన ఓవర్సీస్ రైట్స్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియన్ డాలర్లు రావాలి. ఆ మార్క్‌ను ఇప్పటికే సినిమా దాటింది.

అందువల్ల ఇకపై వసూళ్లన్నీ లాభాలే. సోమవారం నాటికి 5 మిలియన్ మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ అందించాడు. సినిమా విజయవంతంగా ముందుకు సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular