Tuesday, July 28, 2026
HomeMovie NewsOG: ప్రభాస్, పవన్ కాంబోపై సుజిత్ క్లారిటీ

OG: ప్రభాస్, పవన్ కాంబోపై సుజిత్ క్లారిటీ

og-prabhas-pawan-kalyan-universe-sujeeth-clarity

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంలో చిత్రబృందం మీడియా ముందుకు వచ్చింది.

డైరెక్టర్ సుజిత్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రశ్నపై క్లారిటీ ఇచ్చారు. అంటే సాహో , ఓజీ యూనివర్స్ కుదరుతుందా? ప్రభాస్ పవన్ కలయిక ఉంటుందా అన్నది.

సుజిత్ మాట్లాడుతూ, “ప్రభాస్ అన్న నాకు చాలా దగ్గర. పవన్ సర్‌తో కూడా ఇప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది. యూనివర్స్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ, ఇప్పుడు ఏ నిర్ణయాలు చెప్పలేను. ముందుగా ప్రజలు సినిమా ఎలా స్వీకరిస్తారో చూడాలి” అని చెప్పారు.

అయితే, ఒకవేళ యూనివర్స్ కుదిరితే ప్రభాస్, పవన్ బ్రదర్స్‌గా కనెక్ట్ అవుతారని ఆయన హింట్ ఇచ్చారు. ఓజీలో గంభీర్‌ను సత్యదాదా దత్తపుత్రుడిగా, సాహోలో ప్రభాస్‌ను రాయ్ కుమారుడిగా చూపించి, సత్యదాదా , రాయ్ బ్రదర్స్‌గా చూపే ప్లాన్ ఉందని తెలిపారు.

అలాగే ఓజీ పోస్ట్ క్రెడిట్స్ సీన్‌లో పవన్ “నేను మళ్లీ వస్తా” అని చెప్పడం యాదృచ్ఛికం కాదని ఆయన వివరించారు. కానీ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

మొత్తానికి, ప్రభాస్ పవన్ కలయికపై సుజిత్ ఇచ్చిన హింట్ ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. నిజంగా యూనివర్స్ కుదిరితే పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని క్లియర్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular