
ప్రతి శుక్రవారం సినిమా ప్రియులకు పండగే. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 26న ఒకే రోజు 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల అవ్వబోతున్నాయి. కామెడీ, యాక్షన్, హారర్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇలా అన్ని జానర్స్ లో వినోదం సిద్ధంగా ఉంది.
జియో హాట్‌స్టార్‌లో మలయాళ బ్లాక్‌బస్టర్ హృదయపూర్వం స్ట్రీమింగ్ కానుంది. మోహన్‌లాల్, మాళవిక జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్‌తో సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
అమెజాన్ ప్రైమ్‌లో అనుష్క నటించిన ఘాటీ వస్తోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు మంచి హైప్ ఉంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ధడక్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి హిందీ సినిమాలు, కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అదనంగా కొరియన్, ఫ్రెంచ్ మూవీస్ కూడా లిస్ట్‌లో ఉన్నాయి.
జీ5లో జనావర్: ది బీస్ట్ వితిన్, సుమతి వళవు వంటి కంటెంట్ విడుదల అవుతుంది. సన్‌నెక్ట్స్‌లో తెలుగు మూవీ మేఘాలు చెప్పిన ప్రేమకథ కనిపించబోతుంది.
మొత్తంగా ఈ వారం ఓటీటీలలో వినోదం పండగే. తెలుగు ప్రేక్షకులకు ఘాటీతో పాటు ఇతర భాషల హిట్ మూవీస్ కూడా సిద్దంగా ఉన్నాయి.
మా దేవా ( కన్నడ మూవీ)
నెట్ ఫ్లిక్స్ :
ధడక్ 2 (హిందీ సినిమా)
సన్నాఫ్ సర్దార్ (హిందీ సినిమా)
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళం మూవీ)
ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)
హౌస్ ఆఫ్ గిన్నిస్ (ఇంగ్లీష్ సిరీస్)
మాంటిస్ (దక్షిణ్ కొరియన్ మూవీ)
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)
రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)
క్రైమ్ సీన్ జీరో (కొరియన్ వెబ్ సిరీస్)
సన్ నెక్స్ట్:
దూర తీర యానా (కన్నడ మూవీ)
మేఘాలు చెప్పిన ప్రేమ కథ (తెలుగు మూవీ)
జీ 5:
జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)
సుమతి వళవు (మలయాళ మూవీ)
ఆపిల్ ప్లస్ టీవీ:
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)
ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే:
డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ)
మనోరమ మ్యాక్స్:
సర్కీత్ (మలయాళ మూవీ)
హుళు :
ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)
