Monday, January 19, 2026
HomeMovie Newsబిగ్ బాస్ 9లో డబుల్ ఎలిమినేషన్ టాక్

బిగ్ బాస్ 9లో డబుల్ ఎలిమినేషన్ టాక్

bigg-boss-9-double-elimination

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఆసక్తికరమైన ట్విస్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే మిడ్ వీక్ ఎపిసోడ్ లో దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అన్న చర్చ హాట్ టాపిక్ అయింది.

ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు హౌస్ మెంబర్స్ ఉన్నారు. వారిలో వీక్ గా ఉన్నవారికి ఎలిమినేషన్ రిస్క్ ఎక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా కామనర్స్ లో కళ్యాణ్, ప్రియ, హరీష్ పేర్లు ఉన్నాయి. సెలబ్రిటీస్ లో రాము, సంజన ఉన్నారు.

డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎక్కువగా కామనర్స్ కి షాక్ తప్పదని టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ ఆట తీరు ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు. అలాగే ప్రియ కూడా ఇష్యూలను ఎక్కువగా డ్రాగ్ చేస్తూ ఉండడం వల్ల ఆమె కూడా రిస్క్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగితే కళ్యాణ్ దాదాపు కన్ఫర్మ్ గా బయటకి వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. కానీ డబుల్ అయితే ప్రియ లేదా రాము కూడా లిస్ట్ లో ఉండొచ్చని టాక్.

ఈ వారం ఎపిసోడ్ ని దసరా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ టీమ్, మరోవైపు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని కూడా హౌస్ లోకి పంపే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular