Sunday, January 18, 2026
HomeMovie Newsబిగ్ బాస్ 9: కొత్త ట్విస్ట్.. మరో ముగ్గురు కామనర్స్ ఎంట్రీ

బిగ్ బాస్ 9: కొత్త ట్విస్ట్.. మరో ముగ్గురు కామనర్స్ ఎంట్రీ

bigg-boss-9-commoners-new-entries

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు థర్డ్ వీక్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. మొదట 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే శ్రష్టి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు.

ఇక మూడో వారం మొదలయ్యాక హౌస్‌లో మరో ట్విస్ట్ పెట్టాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి ముగ్గురు లేదా నలుగురు కొత్త కామనర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

అందులో నాగ ప్రశాంత్, షాకీబ్, దివ్య నిఖిత పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అనూషకు కూడా అవకాశముందనే చర్చ జరుగుతోంది. అగ్నిపరీక్ష దశలో టాప్ 13లో వీరు ఉన్నందున, ఇప్పుడు మళ్లీ హౌస్‌లోకి రానున్నారని అంచనాలు పెరిగాయి.

వీళ్లను డైరెక్ట్‌గా కంటెస్టెంట్స్‌గా ఉంచుతారా లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీలా చేస్తారా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే ఒకసారి ఎంట్రీ ఇస్తే ఒకరిని మాత్రం హౌస్‌లో రిటైన్ చేసే ప్లాన్ ఉందని టాక్.

దసరా పండుగ సమయంలోనే ఈ వైల్డ్ కార్డ్ ఎపిసోడ్‌ను స్పెషల్‌గా ప్రసారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో బిగ్ బాస్ 9 2.O అనే కాన్సెప్ట్‌ను కూడా లాంచ్ చేస్తారనే ప్రచారం బలంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular