Monday, January 19, 2026
HomeMovie Newsతల్లి కాబోతున్న కత్రినా.. పోటోలతో సెలబ్రేషన్స్ స్టార్ట్

తల్లి కాబోతున్న కత్రినా.. పోటోలతో సెలబ్రేషన్స్ స్టార్ట్

katrina-kaif-pregnancy-official-announcement

బాలీవుడ్‌ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది. గత కొన్ని వారాలుగా వస్తున్న రూమర్స్‌కి స్వయంగా కత్రినా చెక్ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేసింది.

అందులో భర్త విక్కీ కౌశల్ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ, బేబీ బంప్‌తో కనిపించింది. “మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది” అని క్యాప్షన్ రాసింది.

ఈ పోస్టుతో బాలీవుడ్‌లోని సహనటులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివాహం జరిగి నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారబోతున్నందుకు ఈ జంటపై ఫ్యాన్స్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది. అప్పుడు జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పుడు ఆ ప్రేమకథ కొత్త మలుపు తిరిగింది.

కత్రినా కెరీర్ విషయానికి వస్తే, హిందీ సినిమాలతో స్టార్ అయి, తెలుగు ప్రేక్షకులకు కూడా “మల్లీశ్వరి”తో దగ్గరైంది. ఇక విక్కీ కౌశల్ “ఛావా” సినిమాతో ఇటీవలే బాక్సాఫీస్‌ హిట్ కొట్టాడు.

నటుడిగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్ గెలిచిన విక్కీ.. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు. కత్రినా విక్కీ జంట నుండి వచ్చే కొత్త చాప్టర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular