
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా “పౌజీ” కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్లో మరో విభిన్న పాత్రగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
తాజా సమాచారం ప్రకారం, “పౌజీ” విడుదలను ఏప్రిల్ కాకుండా వచ్చే దీపావళి సందర్భంగా ప్లాన్ చేస్తున్నారని నిర్మాణ వర్గాల సమాచారం.
గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ప్రభాస్ ఈ సినిమాతో పాటు “రాజాసాబ్” ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. రెండు చిత్రాల షెడ్యూల్‌లను బ్యాలెన్స్ చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు.
ఈ చిత్రంలో విస్తృతమైన వార్ సన్నివేశాలు, భారీ సెట్లు, సీజీ షాట్లు ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రాజెక్ట్ స్కేలు, ప్రొడక్షన్ విలువలు చూస్తుంటే “పౌజీ” టాలీవుడ్లో కొత్త విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవనుంది.
రాజాసాబ్ జనవరిలో విడుదలైన వెంటనే ప్రభాస్ పూర్తి సమయాన్ని “పౌజీ”కి కేటాయించబోతున్నాడు. దీపావళి రిలీజ్‌తో పాన్ ఇండియా లెవెల్లో మాస్ ఫెస్టివల్ క్రేజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్‌తో టీమ్ ముందుకు సాగుతోంది.