
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఓజి” సినిమా నుంచి వచ్చిన తాజా గ్లింప్స్ అభిమానుల్లో హైప్‌ని మరింత పెంచింది. పవన్ పుట్టినరోజు స్పెషల్‌గా పోస్టర్, వీడియోలు వస్తాయని అభిమానులు ఊహించారు.
కానీ మేకర్స్ మాత్రం విలన్ ఇమ్రాన్ హష్మీ కోణం నుంచి గ్లింప్స్‌ని విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడు సుజీత్ చూపిన తీరు చూసి అభిమానులు పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ అని కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యంగా అతని లుక్స్, డైలాగ్ డెలివరీ గ్లింప్స్‌లోనే ప్రభావం చూపించాయి. దీంతో సినిమా స్థాయి మరింత పెరిగిందని సినీ వర్గాలు అంటున్నాయి.
అయితే గ్లింప్స్ చివర్లో పవన్ కళ్యాణ్ కత్తితో ఇచ్చిన మ్యాడ్ లెవెల్ ట్రీట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. పవర్ స్టార్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చూసి సోషల్ మీడియాలో పోస్టులు వరదలా వస్తున్నాయి.
ఈ గ్లింప్స్‌లో మరో హీరో మాత్రం థమనే. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా ఉండి విజువల్స్‌కు మరో స్థాయి ఇచ్చింది. థమన్ మ్యూజిక్‌తో ఈ సినిమా మాస్ ఎమోషన్‌కి కొత్త ఊపును తెస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
మొత్తానికి ‘ఓజి’ గ్లింప్స్ విలన్ ఇమ్రాన్ ఎంట్రీతో, పవన్ స్టైల్‌తో, థమన్ బిజి బీట్స్‌తో బర్త్ డే స్పెషల్‌గా మ్యాజిక్ సృష్టించింది. అదే టోన్‌లో సినిమా వస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.