
టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటే భారీ సినిమాల పోటీ తప్పనిసరి. 2004లో చిరంజీవి అంజి, బాలకృష్ణ లక్ష్మీ నరసింహా, ప్రభాస్ వర్షం ఒకేసారి బరిలోకి వచ్చాయి. అందులో లక్ష్మీ నరసింహా విజయాన్ని అందుకోగా, అంజి భారీ అంచనాలపై నిలవలేకపోయింది. కానీ వర్షం మాత్రం ప్రభాస్ కెరీర్‌ను కొత్త దిశగా మలిచిన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
ఇప్పుడు అదే సన్నివేశం 2026 సంక్రాంతి బరిలో మళ్లీ కనబడేలా ఉంది. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు జనవరి రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరోవైపు ప్రభాస్ రాజా సాబ్ను ఇప్పటికే జనవరి 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు పెద్ద ప్రాజెక్టులు ఒకే సీజన్‌లో రావడం ఫ్యాన్స్‌లో ఉత్సాహం, అలాగే కలెక్షన్ రేసుపై ఆసక్తిని పెంచింది.
ఇదే సమయంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అంటే, 2004లో జరిగినట్లే మళ్లీ చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ చిత్రాలు ఒకే సీజన్‌లో తలపడే అవకాశం ఉంది.
సంక్రాంతి సీజన్‌లో ఎక్కువ సినిమాలు వచ్చినా, ప్రతి చిత్రానికి తనకంటూ ఒక ఆడియన్స్ ఉంటుంది. అయినా సరే, ఈసారి ఎవరి సినిమా హిట్టవుతుందో, ఎవరి సినిమా నిరాశ మిగిలిస్తుందో చూడాలి.
మొత్తానికి, 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ టాలీవుడ్ చరిత్రలో మరిచిపోలేని పండుగ క్లాష్‌గా నిలవనుంది.
