
న్యూస్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగడం ఇప్పటికే చర్చనీయాంశమవుతుండగా, దక్షిణాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ క్రియేట్ చేశాయి. ద్రావిడ్‌ను గౌరవంగా సాగనంపలేదని, పొమ్మనలేక పరోక్షంగా తొలగించినట్టే ఫ్రాంచైజీ వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డాడు.
డివిలియర్స్ మాట్లాడుతూ, “ఫుట్‌బాల్ లీగ్స్‌లో మేనేజర్లు, కోచ్‌లపై గెలుపోటముల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. క్రికెట్‌లో కూడా అదే పరిస్థితి. ద్రావిడ్‌కు ఫ్రాంచైజీ వేరే బాధ్యతలు ఇవ్వాలని అనుకుంది. కానీ ఆయన అంగీకరించకపోవడంతో, పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది వాస్తవానికి తొలగింపే” అని తెలిపారు.
అదే సమయంలో రాజస్థాన్ జట్టుపై గత మెగా వేలం సమయంలో చేసిన తప్పిదాలను కూడా ఏబీడీ ప్రస్తావించాడు. “ఒకేసారి అనేకమంది కీలక ఆటగాళ్లను వదిలేయడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపింది. వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఈ స్థితి వచ్చింది” అని ఆయన విమర్శించాడు.
ఇక జట్టులో అంతర్గత విభేదాలు కూడా పెరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడవచ్చని, అతని స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా చూడాలన్న చర్చ నడుస్తోందని సమాచారం. ఈ విషయాల్లోనూ ద్రావిడ్-యాజమాన్యం మధ్య విభేదాలు పెరిగినట్టే కనిపిస్తోంది.
