
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రొఫెషనలిజంతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం అభిమానులను కలచివేసింది.
అయినా వ్యక్తిగత బాధను మనసులో దాచుకొని, పనికి అంతరాయం కలగకుండా ముంబైలో జరుగుతున్న AA22 షూట్‌లో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
అల్లుఅర్జున్ బాధలో ఉన్నప్పటికీ, భారీ ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా చూడడం ఆయన బాధ్యత భావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో అతని డెడికేషన్‌ను ప్రశంసిస్తూ, “ఇదే నిజమైన కమిట్‌మెంట్” అని కామెంట్లు చేస్తున్నారు. సినీ వర్గాలు కూడా బన్నీ చూపిస్తున్న ఈ కట్టుబాటును మెచ్చుకుంటున్నాయి.
దర్శకుడు అట్లీ తీస్తున్న AA22లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ కథతో బన్నీ కెరీర్‌లో మరో మైలురాయి కట్టాలని యూనిట్ భావిస్తోంది. చిత్ర యూనిట్ చెబుతున్న దాని ప్రకారం, అల్లు అర్జున్ పాత్ర కొత్త కోణంలో ఉంటుందని సమాచారం.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. ఆమె అల్లు అర్జున్ సరసన మొదటిసారి జత కడుతున్నందున సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
