Sunday, August 23, 2026
HomeMovie Newsయూఎస్ మార్కెట్ లోనే పవర్ స్టార్ ప్రభావం.. ‘ఓజి’ బుకింగ్స్ హవా!

యూఎస్ మార్కెట్ లోనే పవర్ స్టార్ ప్రభావం.. ‘ఓజి’ బుకింగ్స్ హవా!

og-us-premieres-bookings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై క్రేజ్ అంతా ఇంతా కాదు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది.

అమెరికా మార్కెట్‌లో ప్రీమియర్ బుకింగ్స్ మొదలైన వెంటనే దాని ప్రభావం స్పష్టంగా కనబడింది. కేవలం మూడు లొకేషన్లలోనే ప్రీ-సేల్స్ దాదాపు లక్ష డాలర్ల వరకు చేరుకోవడం విశేషం. ఇది పూర్తిస్థాయి బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలాంటి రికార్డులు తిరగరాయబోతుందో ఊహించవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలకి యూఎస్ లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉన్నా, ఓజి క్రేజ్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ఫైర్ స్టార్మ్ సాంగ్ సినిమాపై మరింత హైప్ పెంచాయి.

సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉండగా యూఎస్ మార్కెట్ నుంచే ఈ స్థాయి బుకింగ్స్ రావడం ఫ్యాన్స్ కి డబుల్ ఎనర్జీ ఇచ్చింది. ట్రేడ్ వర్గాలు కూడా ఓజి బాక్సాఫీస్ దగ్గర ఊహించని రికార్డులు సృష్టిస్తుందని ధీమాగా చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 7098457586a8b6fe48e8cf