
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. బాలయ్య పూర్తి సహకారంతో షూటింగ్, డబ్బింగ్ కూడా సకాలంలో పూర్తి చేశారు.
అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పని ఇంకా పూర్తికాకపోవడంతో టీమ్ విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక విడుదల వాయిదా వెనుక మరో కారణం ఓజి క్లాష్ అని వచ్చిన ప్రచారాన్ని యూనిట్ ఖండించింది. దసరా సెలవులు ఉండటంతో భక్తి, మాస్ ప్రేక్షకులు ఎలాగూ అఖండ 2 వైపే మొగ్గు చూపుతారని భావిస్తోంది.
కానీ, సెప్టెంబర్ కుదరకపోతే డిసెంబర్ 5 రిలీజ్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదే రోజున ది రాజా సాబ్ మొదట ఉండగా, అది వెనక్కు తగ్గిన నేపథ్యంలో అఖండ 2కి ఇది సరైన టైమింగ్‌గా భావిస్తున్నారు.
గతంలో పుష్ప 2, యానిమల్, అఖండ వంటి సినిమాలు డిసెంబర్‌లో భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సీజన్‌ను మాస్ సినిమాల కోసం మంచి ప్లాట్‌ఫామ్‌గా నిర్మాతలు భావిస్తున్నారు.
ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే, ఇప్పట్లో యూనిట్ పెద్దగా కదలికలు చేయడం లేదు. డిసెంబర్ టార్గెట్ అయితే ఆల్బమ్ రిలీజ్, ట్రైలర్ లాంచ్‌ను క్రమంగా ప్లాన్ చేస్తారు. తమన్ కంపోజ్ చేసిన పాటలు ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని ఇప్పటికే చర్చ నడుస్తోంది.
