
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచే 100వ సినిమా కోసం భారీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. రా కార్తీక్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయి, అన్నపూర్ణ స్టూడియోస్ పై భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వబోతోందని సమాచారం.
మూవీని యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నాగార్జునకు ఇది 100వ మూవీ కావడంతో, ఎలాంటి రిస్క్ లేకుండా బలమైన కథను ఎంచుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్ విషయంలో “100 నాటౌట్” అనే పేరు పరిశీలనలో ఉందట.
దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని, లాంచ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబోతున్నారని టాక్ ఉంది.
ఇంతలోనే మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఈ మూవీలో స్పెషల్ రోల్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తండ్రి 100వ సినిమాలో భాగమవ్వడం ఇద్దరికీ గర్వకారణం అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
గతంలో మనం సినిమాలో ముగ్గురూ కలిసి నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కింగ్ 100 లో మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని టాక్ రావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.