
న్యూస్ డెస్క్: అమెరికా డల్లాస్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన భారతీయుల సమాజాన్ని కలచివేసింది. కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తి హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తూ, తన సహోద్యోగి చేతిలో క్రూర హత్యకు గురయ్యాడు.
చిన్న వాగ్వాదమే పెద్ద విషాదంగా మారింది. హోటల్లో పనిచేసే యోర్డానిస్ కొబోస్ మార్టినెజ్ (37) అనే వ్యక్తి, నాగమల్లయ్య విరిగిపోయిన వాషింగ్ మెషీన్ వాడొద్దని మరో ఉద్యోగి ద్వారా చెప్పించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే కత్తి తీసుకొని దాడి చేశాడు.
ఆ దాడిని అడ్డుకోవడానికి నాగమల్లయ్య భార్య, కుమారుడు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. విచక్షణారహితంగా దాడి చేసిన మార్టినెజ్ చివరికి తలను నరికి చెత్తకుప్పలో పడేశాడు.
పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సర్వైలెన్స్ వీడియోలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసు కొనసాగుతోంది.
హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు కస్టడీలోనే ఉన్నాడని స్పష్టం చేసింది.
ఈ సంఘటన అమెరికాలోని భారతీయుల భద్రతపై ఆందోళన రేపుతోంది. స్థానిక సమాజం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇది సాధారణ ఘర్షణ కాదని, పూర్వ ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు.
