
న్యూస్ డెస్క్: మొన్నటి చంద్రగ్రహణం తర్వాత మరో వారంలో సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ నెల 21న ఆదివారం పాక్షిక సూర్యగ్రహణం జరుగనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు.
ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్, పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రమే చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:59 గంటలకు మొదలై తెల్లవారుజామున 3:23 వరకు కొనసాగుతుంది. కాబట్టి మనకు కంటికి కనిపించదు.
గ్రహణాలు ఆధ్యాత్మిక కోణంలో యోగులు, సాధకులకు ప్రత్యేకమైన సమయాలుగా చెప్పబడతాయి. పూజలు, జపాలు, దానాలు విశేష ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఉంది. కానీ ఈ సారి మన దేశంలో అది కనిపించకపోవడంతో సాధారణ ప్రజలకు ప్రభావం ఉండదు.
అయితే ఈ గ్రహణం సింహరాశి వారిపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే సింహరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో సముద్రాల్లో అలజడి సాధారణం. అందువల్ల తీరప్రాంతాల్లో నివసించే వారు కాసింత అప్రమత్తంగా ఉండాలి.
మొత్తానికి ఈ సూర్యగ్రహణం మన దేశానికి పెద్దగా ప్రభావం చూపకపోయినా, జ్యోతిష్యపరంగా కొన్ని రాశుల వారికి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పబడుతోంది.
