
న్యూస్ డెస్క్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న దేశవ్యాప్తంగా ‘రైల్ రోకో’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలని ఆమె కోరారు. డెక్కన్ నుంచి ఢిల్లీ వరకు ఒక్క రైలును కూడా కదలనివ్వబోమని హెచ్చరించారు.
ప్రధాని మోదీ ఓబీసీ అని చెప్పుకుంటూ, బీసీలకు న్యాయం చేయడంలో వెనుకడుగు వేయడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. బిల్లును వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టికల్ 243(డి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ద్వారా అమలు చేయడంపై అధికారం ఉందని ఆమె పేర్కొన్నారు. కానీ కేంద్ర మద్దతు అవసరమని చెప్పారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదని, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.