తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆమె విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల మోసంపైనా చర్చించాలి అని సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమం ప్రారంభించారు.
రెవంత్ సీఎం అయ్యేది తెలంగాణ వల్లే అని, కేసీఆర్ లేకపోతే ఆ అవకాశమే ఉండేది కాదని గుర్తుచేశారు. దమ్ము కేసీఆర్‌ది కాకపోతే, తెలంగాణ సాధ్యపడేదా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను చంద్రబాబుకి అప్పగించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గ్యారెంటీ కార్డులు ఇచ్చి మోసం చేశారని ఆమె మండిపడ్డారు.
వృద్ధుల పెన్షన్‌ను రూ.4 వేలకు, వికలాంగులకు రూ.6 వేలకు పెంచాలని, మహిళలకు రూ.2,500 ఇవ్వాలని కాంగ్రెస్ చెప్పి మరిచిపోయిందని ఆమె మండిపడ్డారు.
పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇస్తామని కవిత పేర్కొన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
