
న్యూస్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి తన క్రియేటివిటీని ప్రూవ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన “లక్కీ భాస్కర్” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ, ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేశారు.
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అన్నీ కలిసివచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే అప్పట్లో ఈ సినిమాకు సీక్వెల్ హింట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి స్వయంగా “లక్కీ భాస్కర్ పార్ట్ 2” రూపొందనున్నట్లు వెల్లడించారు.
ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్‌తో సినిమాకు అభిమానులలో మరోసారి ఆసక్తి జగరిస్తోంది. మొదటి భాగంలో భాస్కర్ జర్నీ ఎక్కడ ముగిసిందో, సీక్వెల్‌లో అక్కడినుంచి ఎలా మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ సూర్యతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే లక్కీ భాస్కర్ 2కి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమయ్యే అవకాశముంది.
ఫ్యామిలీ కథలకు పేరు తెచ్చుకున్న వెంకీ, సీక్వెల్‌తో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
lucky bhaskar 2, venky atluri, dulquer salmaan, meenkashi chaudhary, surya next film,
