
న్యూస్ డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్రబృందం జూలై 25న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అదే రోజు ముందు రోజే పవన్ కల్యాణ్ నటించిన భారీ పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కావడం వల్ల, పోటీ నుంచి తప్పుకోవాలని మేకర్స్ భావించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ‘కింగ్డమ్‘ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాత నాగవంశీ వచ్చారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆగస్టు 14న మరో రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రావడంతో, తమ సినిమాకు మధ్యలో రెండు వారాల స్పేస్ ఉండటం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నాడు. ఇకపై ఆయన దృష్టి ‘వార్-2’ పై ఉండనుంది.
ఫైనల్‌గా జూలై 31న ‘కింగ్డమ్’ థియేటర్లలోకి వస్తుందా? అన్నది త్వరలో అధికారిక ప్రకటనతో క్లారిటీ రానుంది.