న్యూస్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి వేడి రేపుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.
సిద్ధరామయ్య – డీకే మధ్య సీఎం పదవిని పంచుకునే ఒప్పందం ఉందనే వార్తలు గత నుంచి వినిపిస్తున్నాయి. మొదటి అరవై నెలలు సిద్ధరామయ్య, మిగతా కాలం శివకుమార్ సీఎంగా పనిచేయాల్సిందిగా అనుకున్నట్లు ప్రచారం ఉంది.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. డీకే కూడా పదవిని ఆశించడంలో తప్పేముందంటూ వ్యాఖ్యానించారు.
అయితే సిద్ధరామయ్య మాత్రం తాను ఐదేళ్లూ కొనసాగుతానని స్పష్టంగా చెబుతున్నారు. దీంతో పార్టీ ఆంతర్యం ఎలా మలుపుతీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో డీకే – ప్రియాంక గాంధీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో సిద్ధరామయ్య కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉండగా, అధిష్టానం నిర్ణయం కీలకం కానుంది.
