
న్యూస్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహనరావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టికెట్ల కేటాయింపులో ఏర్పడిన వివాదం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
గత ఐపీఎల్ సీజన్ సమయంలో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య టికెట్లపై విభేదాలు తీవ్రంగా తలెత్తాయి. టికెట్లు ఇవ్వలేదని కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం హైదరాబాద్ నుంచి ఫ్రాంచైజీని తరలిస్తామని హెచ్చరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ నివేదికలో జగన్మోహనరావు వైఖరిలో తప్పులున్నాయని వెల్లడించారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై ఒత్తిడి చూపారని తేల్చారు.
దీని ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకుంది. మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది.
