
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత, అతను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ సినిమాలో నటించబోతున్నాడు.
ఇప్పటికే ఫిక్స్ చేసిన ఈ టైటిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ కథలో విలన్ పాత్ర కోసం ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి.
గతంలో కొరియన్ నటుడు డాంగ్ లీ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ‘స్పిరిట్’లో విలన్ డాంగ్ లీనా? అని అడగగా, “మీరు అనుకున్నదే జరుగుద్ది” అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు.
ఈ సమాధానం విన్న అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. దీని ద్వారా డాంగ్ లీ స్పిరిట్లో విలన్‌గా కన్ఫర్మ్ అయ్యాడనే అభిప్రాయం బలపడింది.