Sunday, August 23, 2026
HomeNationalచనిపోయిన తల్లి ఖాతాలో లక్షల కోట్లు.. మెసేజ్ చూసి షాక్ అయిన కొడుకు!

చనిపోయిన తల్లి ఖాతాలో లక్షల కోట్లు.. మెసేజ్ చూసి షాక్ అయిన కొడుకు!

deepak-shocked-after-seeing-crores-in-mothers-account

న్యూస్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో ఓ యువకుడికి జరిగిన అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రికి రాత్రే తన తల్లి బ్యాంకు ఖాతాలో వేల కోట్ల రూపాయలు వచ్చాయన్న మెసేజ్ చూసిన దీపక్ అనే యువకుడు షాక్‌కు గురయ్యాడు.

రెండు నెలల క్రితం మరణించిన గాయత్రీ దేవి అనే మహిళ ఖాతాలో ₹10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 జమైందని ఫోన్‌లో సందేశం రావడంతో దీపక్ కంగారుపడ్డాడు. వెంటనే తన స్నేహితుల సాయంతో లెక్కలు చూసి స్థానిక బ్యాంకును ఆశ్రయించాడు.

ఈ విషయం డాంకౌర్ పరిధిలోని కోటక్ మహీంద్రా బ్యాంకుకు తెలియగానే అక్కడి అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు సమాచారం. అయితే దీన్ని అఫీషియల్‌గా బ్యాంకు ఖండించింది.

కోటక్ మహీంద్రా బ్యాంకు అధికార ప్రతినిధులు స్పందిస్తూ.. ఆ ఖాతాలో ఏ విధమైన పెద్ద మొత్తాలు జమ కాలేదని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇది ఫేక్ మెసేజ్ కావచ్చని అర్థమవుతోంది.

ఈ సంఘటన నేపథ్యంలో మెసేజ్‌లను అజ్ఞానంగా నమ్మకూడదని, అనుమానాస్పద సందేశాల విషయంలో వెంటనే బ్యాంకులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 6899199796a8b73771d343