
న్యూస్ డెస్క్: కోట్లాది మంది బ్యాంక్ ఖాతాదారులకు తీపి కబురు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే వసూలు చేసే అపరాధ రుసుములను (పెనాల్టీ) రద్దు చేశాయి.
పీఎన్‌బీ జూలై 1 నుంచి అన్ని సేవింగ్స్ ఖాతాదారులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. మహిళలు, రైతులు, అల్పాదాయ వర్గాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ సీఈఓ అశోక్ చంద్ర వెల్లడించారు.
కెనరా బ్యాంక్ ఇప్పటికే మే నెలలో ఈ నిర్ణయాన్ని తీసుకొని జూలై 1 నుంచి అమలులోకి తెచ్చింది.
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా జులై 2న “మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు ఇక లేవు” అంటూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
జులై 7 నుంచి ఇండియన్ బ్యాంక్ కూడా ఈ ఛార్జీలను పూర్తిగా తొలగిస్తున్నట్టు తెలిపింది.
ఇప్పటికే 2020లో ఎస్‌బీఐ ఈ ఛార్జీలను రద్దు చేయగా, తాజాగా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అదే బాటలో సాగడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
