
‘పుష్ప 2’తో పాన్-ఇండియా డైరెక్టర్‌గా మారిన సుకుమార్ లైనప్ ఆసక్తికరంగా మారింది. ఆయన తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో ఖరారైంది. ఇది ‘రంగస్థలం’ కాంబో రిపీట్ కానుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
చరణ్ సినిమా తర్వాత సుకుమార్ ఏం చేస్తారనేది సస్పెన్స్. ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ ఉంటుందని ప్రకటించినా, అది ఇప్పట్లో ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ ఇతర కమిట్‌మెంట్లు పూర్తి చేసుకుని, ఫ్రీ అయ్యాకే ఆ ప్రాజెక్ట్ మొదలవుతుంది.
మరోవైపు, సుకుమార్ ఎప్పుడో విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్రకటించారు. ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ గురించి ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా అసలు ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో కూడా సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే, అది మరో భారీ ప్రాజెక్ట్ అవుతుంది.
వీరితో పాటు, మహేష్ బాబుతో ఉన్న పాత బాకీని కూడా సుకుమార్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ‘1 నేనొక్కడినే’ వర్కవుట్ కాకపోవడంతో, ఈసారి ఓ భారీ హిట్‌తో ఈ కాంబోను నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
సుకుమార్ ఇప్పుడు జాతీయ స్థాయి దర్శకుడు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా, అది పాన్-ఇండియా స్థాయిలోనే ఉంటుంది. చరణ్ తర్వాత ఆయన ఎవరికి ఓకే చెబుతారో చూడాలి.
