
న్యూస్ డెస్క్: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ ప్రశంసలు కురిపించాడు. సిరాజ్‌ను “నిజమైన యోధుడు”గా పేర్కొన్న రూట్.. అతని ప్రదర్శనతోపాటు, టీమిండియాపై అతని అంకితభావాన్ని కూడా ప్రశంసించాడు.
ఐదో టెస్టులో సిరాజ్ ధీమాతో బౌలింగ్ చేసి మ్యాచ్‌పై గట్టి ముద్ర వేసిన నేపథ్యంలో రూట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవల్ వేదికగా జరిగిన ఈ టెస్టులో సిరాజ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ అలుపెరుగని పోరాటంతో రెండు కీలక వికెట్లు తీశాడు. మొత్తం ఈ సిరీస్‌లో అతను ఇప్పటి వరకు 20 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో అతని డిసిప్లిన్, కన్‌సిస్టెన్సీని రూట్ ప్రత్యేకంగా ప్రశంసించాడు.
జో రూట్ మాట్లాడుతూ, “సిరాజ్ ఒక యోధుడు. అతని పోరాట పటిమ అద్భుతంగా ఉంటుంది. జట్టులో అలాంటి ఆటగాడిని ఎవరికైనా ఉండాలి. అతను భారత జాతీయ జెర్సీకి గౌరవం ఇస్తూ.. తన శక్తిమంతమైన ప్రదర్శనతో ప్రతిసారి ఆకట్టుకుంటాడు. అతని నైపుణ్యం వల్లే అన్ని కీలక వికెట్లు తీస్తున్నాడు” అని పేర్కొన్నాడు.
అలాగే సిరాజ్ ఆగ్రహంపై రూట్ సరదాగా వ్యాఖ్యానించాడు. “అతను కొన్నిసార్లు మైదానంలో దొంగ కోపాన్ని చూపిస్తాడు. కానీ అది నిజమైన కోపం కాదు. అతను నిజంగా మంచి మనిషి. తన ఫైటింగ్ స్పిరిట్ అంతా భారత్ జట్టుపై ప్రేమకు ప్రతిఫలమే” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.