Monday, June 8, 2026
HomeMovie Newsరష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' ఓవర్సీస్ జోరు.. బ్రేక్ ఈవెన్ పూర్తి!

రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ ఓవర్సీస్ జోరు.. బ్రేక్ ఈవెన్ పూర్తి!

rashmika-the-girlfriend-overseas-box-office-break-even

న్యూస్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‘ విదేశీ మార్కెట్‌లోనూ సత్తా చాటుతోంది. నవంబర్ 7న విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామాకు ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన వస్తోంది.

నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఇప్పటికే $625,777 (USD 625K+) వసూలు చేసింది. దీంతో అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల బాట పట్టింది.

విదేశాల్లోనే కాదు, దేశీయంగా కూడా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నిలకడగా వసూళ్లు రాబడుతోంది. తొలి 5 రోజుల్లోనే ఇండియాలో రూ. 20 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది.

స్లో స్టార్ట్ లభించినా, బలమైన పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వీక్ డేస్‌లో కూడా సినిమా స్టడీగా నిలబడింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలైన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular