
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా‘ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. అనవసరమైన సాగదీత లేకుండా, పర్ఫెక్ట్‌గా 2 గంటల 35 నిమిషాల నిడివితో వస్తుండగా, సెన్సార్ టాక్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తోంది.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, రామ్ పోతినేని ఈ సినిమాకు ప్రధాన ఆస్తి. ఆయన నటన వన్ మ్యాన్ షోగా నిలవనుందట. ఒక సినిమా స్టార్‌కు, అతని అభిమానికి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను దర్శకుడు మహేశ్ బాబు పి అద్భుతంగా చూపించారని ప్రశంసలు వస్తున్నాయి.
ముఖ్యంగా సినిమా చివరి 45 నిమిషాలు అదిరిపోతుందని చెబుతున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారని, ఈ ఎమోషనల్ కోర్ ఆడియన్స్‌ను కచ్చితంగా కంటతడి పెట్టిస్తుందని టాక్. కన్నడ స్టార్ ఉపేంద్ర క్లైమాక్స్‌లో హైలైట్‌గా నిలుస్తారని సమాచారం.
రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయిందట. అలాగే తండ్రి పాత్రలో రావు రమేష్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ గా చాలా గ్రాండ్‌గా చూపించాయని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వస్తోంది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో రామ్ గట్టి హిట్ కొట్టడం ఖాయం.
