
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో నాలుగు వారాల్లో ముగియనుంది. ఈ సమయంలో సీజన్ 10 గురించి ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటంటే, బిగ్ బాస్ టీమ్ అన్నపూర్ణ స్టూడియోస్‌ను వదిలి వేరే చోట సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయబోతున్నారట.
దీనితో హోస్ట్ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ కంఫర్ట్‌గా పూర్తి చేస్తున్నారు. కానీ ప్లేస్ మారితే, నాగార్జున హోస్ట్‌గా కొనసాగే అవకాశం లేదని అంటున్నారు.
దీంతో బిగ్ బాస్ సీజన్ 10కి కొత్త హోస్ట్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రతి సీజన్ మొదట్లో వినిపించే రానా వెంకటేష్ లాంటి స్టార్స్ పేర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.
అయితే బిగ్ బాస్ టీమ్ ఒక మాస్టర్ ప్లాన్ చేసింది. సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్‌కు ఒక స్టార్ హీరోను గెస్ట్‌గా తీసుకురాబోతున్నారట. ఆయనే సీజన్ 10కి కొత్త హోస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ప్లేస్ ఛేంజ్‌తో పాటు బిగ్ బాస్ టీమ్ కొత్త టెక్నిషియన్లతో సీజన్ 10 ప్లాన్ చేస్తుందట. లోకల్ టెక్నిషియన్స్ వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లీక్స్ వస్తున్నాయని భావిస్తున్నారు.
కొత్త హోస్ట్, కొత్త వేదికతో బిగ్ బాస్ సీజన్ 10 ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
