Thursday, June 25, 2026
HomeMovie Newsమహేష్, ప్రభాస్ సినిమాల్లో సుధీర్ బాబు కొడుకు!

మహేష్, ప్రభాస్ సినిమాల్లో సుధీర్ బాబు కొడుకు!

darshan-sudheer-babu-son-debut-mahesh-babu-prabhas-fauji-varanasi

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వెండితెర అరంగేట్రానికి రెడీ అయ్యాడు. అతడే సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్. మేనమామ మహేష్ బాబు పోలికలతో ఉండే ఈ బుడ్డోడు, ఏకంగా రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంట్రీ ఇస్తున్నాడు.

దర్శన్.. మహేష్ బాబు ప్రతిష్టాత్మక సినిమా ‘వారణాసి’ (SSMB29)లో కనిపించనున్నాడట. ఇందులో ఏకంగా మేనమామ మహేష్ చిన్నప్పటి పాత్రలో దర్శన్ నటిస్తున్నాడు. మేనమామ రోల్ లో మేనల్లుడు కనిపించడం ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.

కేవలం మహేష్ బాబు సినిమాలోనే కాదు, డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’లో కూడా దర్శన్‌కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇటు మహేష్, అటు ప్రభాస్ సినిమాల్లో అవకాశాలు రావడం విశేషం.

దర్శన్‌కు కెమెరా కొత్తేమీ కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. చిన్నప్పుడే భారీ ప్రాజెక్టులతో కెరీర్ మొదలుపెడుతున్నాడు.

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి స్టార్ అయినట్టే, దర్శన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో దర్శన్ నటన ఎలా ఉంటుందో, ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular