Friday, January 16, 2026
HomeInternationalఅమెరికాలో ఎన్నారైలపై 'వలపు' వల.. మాస్టర్స్ విద్యార్థినుల హనీట్రాప్!

అమెరికాలో ఎన్నారైలపై ‘వలపు’ వల.. మాస్టర్స్ విద్యార్థినుల హనీట్రాప్!

indian-nris-honeytrap-scam-us-masters-students-warning

న్యూస్ డెస్క్: అమెరికాలోని సంపన్న భారతీయ ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ‘హనీట్రాప్’ మోసాలు కలకలం రేపుతున్నాయి. మాస్టర్స్ చదువుతున్న భారతీయ విద్యార్థినులు కొందరు.. ప్రేమ, రిలేషన్‌షిప్‌ పేరుతో ఎన్నారైలను మోసగిస్తూ, వారి నుంచి డబ్బు, విలువైన వస్తువులు దోచుకుంటున్నారు.

ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సంపన్నులను లక్ష్యంగా చేసుకుని, ఇళ్లలో హెల్పర్లుగా చేరిపోతున్నారు. మొదట్లో నమ్మకంగా ఉంటూ, సమయం చూసి ఇళ్లలోని డబ్బులు, ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు.

దొంగతనం చేసిన ఈ వ్యక్తిగత డేటా వీడియోలను ఆధారంగా చేసుకుని ఎన్నారైలను బ్లాక్‌మెయిల్ చేసి, లక్షల కొద్దీ డబ్బులు లాగుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌తో ఒత్తిడి పెట్టి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ తరహా మోసాలు ముఖ్యంగా డల్లాస్, ఓహియో ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని ఓ యువతి ‘ఎక్స్’ వేదికగా వీడియో పోస్ట్ చేసింది. కొందరు విద్యార్థినులు ఈ మోసాల ద్వారా ఏకంగా ఇళ్లు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

కొంతమంది విద్యార్థినులు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ చీటింగ్‌లకు కూడా పాల్పడుతున్నారు. సాధారణంగా దేశాల రహస్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించే హనీట్రాప్ టెక్నిక్‌ను, యువతులు డబ్బు సంపాదించడానికి వాడుతున్నారు.

ఒక స్టూడెంట్ కేవలం రెండేళ్లలో $1 మిలియన్ (సుమారు 8 కోట్లు) సంపాదించిందని బాధితులు తమ అనుభవాన్ని పంచుకున్నారు. విదేశాలలో ఒంటరిగా ఉన్న భారతీయ సంపన్నులు, ముఖ్యంగా సహాయకులను నియమించుకునేవారు, ఇటువంటి మోసాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular