
హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే.. రామ్ పోతినేని సరసన నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (నవంబర్ 28) సినిమాతో హిట్ కొట్టాలని చూస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
ఈ ఊహాగానాలపై భాగ్యశ్రీ బొర్సే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చింది. తాను రామ్ మంచి ఫ్రెండ్స్‌మని మాత్రమే తెలిపింది. రామ్ చాలా మంచి నటుడని, ఆయన కష్టపడి పనిచేసే తీరును తాను ఆరాధిస్తానని ప్రశంసలు కురిపించింది.
ఈ కామెంట్స్‌తో రామ్‌తో ఉన్న రిలేషన్ షిప్ వార్తలకు చెక్ పడింది. అయితే, ఇదే ఇంటర్వ్యూలో ఆమె మరో ఆసక్తికర విషయం చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరితో లవ్ లో లేనని స్పష్టం చేసింది.
అయినప్పటికీ.. తనకు ప్రేమపై విపరీతమైన విశ్వాసం ఉందని, కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని భాగ్యశ్రీ తెలిపింది. తనను అర్థం చేసుకునే మంచి వ్యక్తి జీవితంలోకి వస్తాడనే నమ్మకంతోనే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది.
ప్రేమలో లేకుండా లవ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటుందని కొందరు అడుగుతున్నారు. ఏదేమైనా భాగ్యశ్రీ తన రిలేషన్ షిప్ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చి, తన దృష్టి గోల్స్ పైనే ఉందని చెప్పింది.
