
2026 ఆస్కార్ అవార్డ్స్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన 24 సినిమాల్లో టాలీవుడ్ నుంచి పుష్ప 2, కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం, గాంధీ తాత చెట్టు, కుబేర లాంటి చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ జాబితా మీదే తెలుగు సినీప్రేక్షకులు బిగ్ హోప్ పెట్టుకున్నారు.
అయితే ఫైనల్‌గా భారత్ తరఫున హోమ్ బౌండ్ అనే బాలీవుడ్ చిత్రం మాత్రమే ఎంపికైంది. ఈ మూవీని “ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్” విభాగంలో నామినేట్ చేశారు. దీంతో టాలీవుడ్ నుంచి ఆస్కార్ బరిలో ఎలాంటి సినిమా లేకపోవడం నిరాశ కలిగించింది.
గతంలో మదర్ ఇండియా, సలామ్ బాంబే!, లగాన్ చిత్రాలు నామినేషన్ దాకా చేరుకున్నా అవార్డు దక్కలేదు. అయితే స్లమ్‌డాగ్ మిలియనీర్, RRR వంటి సినిమాలు ఇతర విభాగాల్లో విజయం సాధించాయి. ఈసారి హోమ్ బౌండ్ ఆ ట్రాడిషన్‌ను బ్రేక్ చేస్తుందా అన్నదే హాట్ టాపిక్.
హోమ్ బౌండ్ కు ఇప్పటికే కేన్స్ ఫెస్టివల్‌లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ లభించింది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకుంది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు.
నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది. హాలీవుడ్ లెజెండ్ మార్టిన్ స్కోర్సెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. దీంతో గ్లోబల్ రేంజ్ లో హైప్ పెరిగింది.
మొత్తం మీద టాలీవుడ్ సినిమాలు లిస్ట్‌లో నిలిచినా, ఫైనల్ ఎంట్రీ దక్కకపోవడం ఫ్యాన్స్ కి మైనస్ పాయింట్ అయ్యింది. కానీ హోమ్ బౌండ్ విజయవంతమైతే, భారత్ కోసం చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
