Monday, January 19, 2026
HomeMovie Newsమిరాయ్ 2 కోసం ఇంకా 3 ఏళ్లు వెయిట్ చేయాలా?

మిరాయ్ 2 కోసం ఇంకా 3 ఏళ్లు వెయిట్ చేయాలా?

mirai-2-sequel-release-update-teja-sajja-vs-rana

తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. యూఎస్‌లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి, ఓవరాల్ గా 100 కోట్ల మార్క్ దాటింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్, శ్రీయ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు హైప్ ఇచ్చింది.

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రానా విలన్ ఎంట్రీ పెద్ద సర్‌ప్రైజ్ అయింది. అంతే కాదు మిరాయ్ 2 కు హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెంచింది. అయితే సీక్వెల్ త్వరగా రాదని ఫ్రెష్ టాక్.

డైరెక్టర్ కార్తీక్ ముందే మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమాకు కెమెరా వర్క్ చేయాలి. మరోవైపు తేజ సజ్జకు జాంబి రెడ్డి 2, జై హనుమాన్ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఈ రెండు పూర్తయ్యాకే మిరాయ్ 2 మొదలు కావొచ్చు.

కార్తీక్ తాజాగా ఇంటర్వ్యూలో మిరాయ్ 2 షూటింగ్ 2027 లోనే మొదలవుతుందని తెలిపాడు. రిలీజ్ 2028 లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పాడు.

అంటే ఫ్యాన్స్ కి ఇంకా మూడు సంవత్సరాలు వెయిట్ తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సీక్వెల్ లో తేజ సజ్జ, రానా ఢీ ఘనంగా ఉండబోతోందని హింట్ ఇచ్చాడు.

మొత్తానికి మిరాయ్ 2 కోసం వేచి ఉండాల్సిందే. కానీ సీక్వెల్ ఖచ్చితంగా బిగ్ స్కేల్ లో, మరింత హైప్ తో రానుందని క్రియేటర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular